గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 మే 2022 (13:24 IST)

ఓటీటీలో ఆర్ఆర్ఆర్.. ట్రైలర్ రిలీజ్.. "భళా తందనాన"తో ఫైట్?

RRR
RRR
ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై రెండు నెలలు గడిచిపోయాయి. తాజాగా ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక సినిమాను మే 20న జీ5 ఓటీటీ ప్లాట్‌ఫాంలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. 
 
ఈ మేరకు తాజాగా ఓ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసింది. అయితే అదే రోజున "ఆర్ఆర్ఆర్"ను ఢీ కొట్టేందుకు ఓ చిన్న సినిమా కూడా రెడీ అయ్యింది.

విలక్షణమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం "భళా తందనాన" ఇటీవల రిలీజ్ అయ్యి ఫ్లాప్‌గా నిలిచింది. కానీ ఓటీటీలో రిలీజ్ చేసి హిట్ కొట్టాలని శ్రీ విష్ణు భావిస్తున్నాడు. 
 
ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను డిస్నీప్లస్ హాట్‌స్టార్ దక్కించుకోవడంతో, మే 20న ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అదే రోజు ఆర్ఆర్ఆర్‌ కూడా ఓటీటీలో విడుదల కానుంది.