శనివారం, 4 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 మే 2022 (22:36 IST)

శ్రీరాముడు ఆచరించిన ఏకాదశి వ్రతం విశిష్టత... భార్యాభర్తలు అలా..? (video)

Ekadasi
అమావాస్య , పౌర్ణమికి తర్వాత ప్రతి నెలా 11వ రోజు వచ్చే తిథిని ఏకాదశిగా పిలుస్తారు. వీటిని శుక్లపక్ష ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి అని పిలుస్తారు. ఏకాదశితో పాటు ద్వాదశి నాడు పూజ పూర్తయిన తరువాత మాత్రమే పూర్తిగా ఈ వ్రతం ముగుస్తుంది. ఏకాదశి రోజున పూర్తిగా ఉపవసించి.. అల్పాహారం తినాలి. ద్వాదశ పారణతో వ్రతాన్ని పూర్తి చేయాలి. 
 
సాధారణంగా గాయత్రిని మించిన మంత్రం లేదు. ఏకాదశిని మించిన ఉపవాసం లేదు.. అంటారు పెద్దలు. ఏకాదశి ఉపవాసం ఉపవాసాలలో ఉత్తమమైనది.
 
ఈ రోజు ఉపవాసం ఉండి నారాయణ స్వామిని పూజించడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం, ఒక్కపూట మాత్రమే తినడం, తులసి తీర్థం సేవించడం, విష్ణువును ఆరాధించడం వల్ల గొప్ప ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు.
 
అలాంటి మహిమాన్వితమైన ఏకాదశి గురువారం (మే 11) రావడం విశేషం. ఈ గురువారం పూట వైశాఖ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథి రోజున శ్రీరాముడే ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. సీతమ్మను వీడిన నానా కష్టాలు పడిన రామునితో వశిష్ఠ మహర్షి ఈ వ్రతాన్ని ఆచరించాల్సిందిగా చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి. 
 
ఈ వ్రతం ఆచరించడం ద్వారానే దశావతారాల్లో ఒకరైన శ్రీరాముడు సీతమ్మతో తిరిగి కలిశాడని విశ్వాసం. అందుచేత ఈ ఏకాదశి రోజున వ్రతమాచరించే దంపతులు అన్యోన్యంగా జీవిస్తారని నమ్మకం. అంతేగాకుండా విడిపోయిన దంపతులు ఈ  ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా జీవితాంతం కలిసి సుఖసంతోషాలతో జీవిస్తారని పండితులు చెప్తున్నారు.
 
ఈ ఏకాదశిని మోహినీ ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల వ్యక్తి పాపాలు నశిస్తాయి. ఒక వ్యక్తి పాపం, బాధల నుండి విముక్తి పొందుతాడు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా గరుడాళ్వార్ అనుగ్రహం లభిస్తుంది. సన్మార్గం సిద్ధిస్తుంది. సుఖసంతోషాలు వెల్లివిరిస్తున్నాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వైకుంఠ ప్రాప్తి చేకూరుతుంది. 

 

 
ఒకవేళ ఈ వ్రతాన్ని ఆచరించడం కుదరని పక్షంలో పెరుమాళ్ల వారి ఆలయాన్ని దర్శించుకోవడం ఉత్తమం. ఏకాదశి సందర్భంగా స్వామి వారికి వస్త్రాన్ని సమర్పించడం.. పూలమాలతో అర్చించడం, తులసీమాలతో పూజించడం వంటివి చేయడం ద్వారా శుభ ఫలితాలను ఆశించవచ్చు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు.