శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 10 మే 2022 (11:14 IST)

పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి అని చంద్రబాబు చెప్పగలరా?

Babu-Pawan
2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో అప్పుడే పొత్తుల గురించి జనసేన-తెదేపా మాట్లాడుతున్నాయి. ఈ పార్టీల పొత్తుల గురించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసారు.

 
త్యాగాలకు సిద్ధం కావాలంటున్న చంద్రబాబు నాయుడు సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్‌ను ప్రకటిస్తారా లేక జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్... తను తగ్గి బాబుని సీఎం చేయాలనుకుంటున్నారా... దీనిపై వారికే క్లారిటీలేదు. పొత్తులు గురించి మాట్లాడి అపహాస్యం అవుతున్నారు.

 
పవన్ కళ్యాణ్ అసలు విడిగా ఎక్కడ వున్నారు.. 2014 నుంచి చంద్రబాబు ఏది చెబితే అదే చేస్తూ వస్తున్నారు. వీళ్లను ప్రజలు నమ్మే స్థితిలో లేరంటూ ఎద్దేవా చేసారు.