ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 జూన్ 2022 (18:43 IST)

NEFR Recruitment 2022: 5636 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

Jobs
ఈశాన్య  ఫ్రాంటైర్‌ రైల్వే బోర్డు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి ఉన్న అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 5636 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
 
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఎస్‌ఈఎఫ్‌ఆర్‌ పరిధిలో పని చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ nfr.indianrailways.gov.inలో ఉంచింది రైల్వే బోర్డు.
 
అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా జూన్‌1 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 30 ఆఖరు తేదీ. 
 
పోస్టు పేరు- ఎన్‌ఈఎఫ్‌ఆర్‌లో అప్రెంటిస్‌ ఉద్యోగం 
ఆర్గనైజేషన్- నార్త్‌ ఈస్ట్ ఫ్రాంటైర్‌ రైల్వే(ఎన్‌ఈఎఫ్‌ఆర్)
విద్యార్హతలు- 50 శాతం మార్కులతో ఐటీఐలో ఉత్తీర్ణులైన వాళ్లు, టెన్త్‌ లేదా దానికి సరిపడా విద్యార్హత కలిగి ఉండాలి. 
అనుభవం- ఫ్రెషర్స్‌కే 
అప్లికేషన్ స్వీకరణ ప్రారంభం- జూన్ 1 
అప్లికేషన్ స్వీకరణ తుది గడువు- జూన్ 30
 
నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2022 వయో ప్రమాణాలు
 
ఎన్ఈఎఫ్ఆర్ రిక్రూట్‌మెంట్ 2022 ద్వారా ఎన్ఈఎఫ్ఆర్ అప్రెంటీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా 15 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ఏప్రిల్ 04, 2022 నాటికి 24 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఎన్ఈఎఫ్ఆర్ అప్రెంటిస్ నోటిఫికేషన్ 2022లో పేర్కొన్న విధంగా 5 సంవత్సరాలు (ఎస్సీ/ఎస్టీ), 3 సంవత్సరాలు (ఓబీసీ) అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది.