సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 మే 2022 (11:22 IST)

భారత ఆహార సంస్థలో 4,710 ఉద్యోగాలు

jobs
భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ)లో 4,710 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను తాజాగా వెల్లడించారు. ఈ పోస్టులన్నీ గ్రూపు 2, 3, 4 కేటగిరీల కిందకు వస్తాయి. ఎఫ్.సి.ఐ జాబ్ రిక్రూట్మెంట్ 2022 పేరుతో ఈ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు. 
 
ఈ మొత్తం పోస్టుల్లో కేటగిరీ 2 కింద 35, కేటగిరీ 3 కింద 2,521, కేటగిరీ 4 కింద 2,154 చొప్పున పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన వారు 8 నుంచి పదో తరగతి, లేదా పట్టభద్రులై వుండాలి. ఎంపిక విధానం రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ విధానంలో జరుగుతుంది. పూర్తి వివరాల కోసం https://fci.gov.in/ అనే వెబ్‌సైట్‌లో చూడొచ్చు.