17,291 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్
తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్ల కోసం ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం 17,291 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ మే 2 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారు.
మే 2 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు
https://www.tslprb.in/ అనే వెబ్ సైట్‌ను సంప్రదించవచ్చు.