తెలంగాణలో కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి అనేక ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వరదనీరు రోడ్లపై మోకాలిలోతు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కనీసం మూడు రోజులు నగరంలోని ప్రజలు బయటకు రావద్దని...