గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2020 (10:39 IST)

'అవినీతి తిమిగలం' తాహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో వెలుగు చూసిన అవినీతి తిమింగలం తాహశీల్దార్ నాగరాజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతంలో కోటి పది లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసి ఆయన ఆ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేసి చెంచల్‌గూడ జైలుకు తరలించారు. 
 
ప్రస్తుతం చెంచల్‌గూడ జైల్లో ఉన్న నాగరాజు.. జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏసీబీ అధికారులకు భారీ మొత్తంలో నగదు, స్థిరాస్తి పత్రాలు, బంగారం లభించడంతో ఏసీబీ అధికారులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
 
ఓ భూ వివాదంలో భారీగా లంచం తీసుకుంటూ అప్పటి కీసర తహశీల్దార్‌గా ఉన్న నాగరాజు పట్టుబడ్డారు. ఆయనతో పాటు వీఆర్ఏ‌ సాయి రాజ్‌‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారుల దాడుల్లో 19 ఎకరాల 39 గుంటల భూమికి సంబంధించిన సమస్యను క్లియర్ చేయడానికి నాగరాజు లంచం డిమాండ్ చేశాడని తేలింది. దానికి సంబంధించిన రూ.1.10 కోట్ల నగదును లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 
 
నాగరాజు వద్ద భారీ మొత్తంలో డబ్బుతో పాటు, అనేక పత్రాలను  ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాగరాజు కారులో రూ. 8 లక్షలు, అతని ఇంట్లో రూ.28 లక్షల నగదును సీజ్ చేశారు. అలాగే 500 గ్రాముల బంగారు ఆభరణాలు, లాకర్ కీ ఏసీబీ అధికారులకు దొరికాయి. అనేక స్థిరాస్తులు సోదాల్లో బయటపడ్డాయి. ఈయన ఆస్తుల విలువ రూ.వంద కోట్లకు పైగా ఉన్నట్టు అంచనా. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా ఎక్కింది. కాగా, విచారణ అనంతరం అధికారులు నాగరాజును చంచల్‌గూడ జైలుకు తరలించారు. అక్కడే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు.