ప్రియుడి వంచన: రైలుకు ఎదురెళ్లి టెక్కీ ఆత్మహత్య
ప్రేమికుడు చేసిన మోసానికి మేడిపల్లిల ఓ లేడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బలైపోయింది. సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి వేధింపులకు గురిచేయడంతో రైలుకి ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకుంది. మేడిపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్వేత, లాలాపేటకు చెందిన అజయ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
వివాహం చేసుకుంటానని నమ్మబలికిన అజయ్ శ్వేతకు మరింత దగ్గరయ్యాడు. ప్రేమ పేరుతో తీసుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో పెట్టిన అజయ్ యువతిని వేధించసాగాడు. ఆ ఫొటోలు తొలగించేందుకు బ్లాక్‌మెయిల్ చేసాడు. ఫోటోలు సోషల్ మీడియాలో పెట్డడంతో వేదనకు గురైన శ్వేత రైలుకి ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది.
శ్వేత కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్వేత ప్రియుడు అజయ్‌ని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. గతంలో ఓసారి అజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు.