శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (22:08 IST)

బ్రేకింగ్ న్యూస్ : సీబీఐ మాజీ డైరెక్టర్ ఆత్మహత్య

సీబీఐ మాజీ డైరెక్టర్ అశ్వనీ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన సిమ్లాలోని తన ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈయన వయసు 69 సంవత్సరాలు. అశ్వనీ కుమార్ మృతిని సిమ్లా ఎస్పీ మోహిత్ చావ్లా నిర్ధారించారు. 
 
అశ్వనీ కుమార్ 1973 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. హిమాచల్ ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఆయన రెండేళ్ల పాటు అదే రాష్ట్రానికి డీజీపీగా ఉన్నారు. 2008 నుంచి 2010 వరకు సీబీఐ డైరెక్టర్‌గా పనిచేశారు. 
 
అంతేకాదు, ఆయన నాగాలాండ్, మణిపూర్‌కు గవర్నర్ గానూ వ్యవహరించారు. ప్రస్తుతం సిమ్లాలో ఉంటున్న అశ్వనీ కుమార్ కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. దీనికితోడు డిప్రెషన్‌కు లోనైన కారణంగానే అశ్వనీ కుమార్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు.