సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2020 (12:13 IST)

ఎదురింటి కుర్రోడిని పెళ్లాడిన భార్య... ఫేస్‌బుక్ లైవ్‌లో భర్త ఏం చేశాడంటే...

తాను ఇష్టపడి కట్టుకున్న భార్య... ఎదురింటి కుర్రోడిని రెండో పెళ్లి చేసుకుంది. దీన్ని జీర్ణించుకోలేని భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలోని అరారియాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సిమ్రాహ్ నివాసి హేమంత్ గుప్తా అనే వ్యక్తికి వివాహమై భార్య మున్నీదేవి ఉంది. ఈమె ఎదురింటి కుర్రాడిపై మనసుపడింది. దీంతో ఆ కుర్రాడిని భర్తకు తెలియకుండా పెళ్లి చేసుకుంది. దీనిని హేమంత్ జీర్ణించుకోలేకపోయాడు. 
 
ఇంటిలోని గదిలోకి వెళ్లి విషం తిని, ఫేస్‌బుక్ లైవ్‌లో తన భార్య మున్నీదేవీ ఎదురింట్లో ఉంటున్న రాకేష్ సాహ్‌ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందని, దీనిని తట్టుకోలేకపోతున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకోబోతున్నానని, తాను చనిపోయిన తర్వాతనైనా తనకు న్యాయం చేయాలని కోరాడు. ఈ లైవ్ చూసిన కొంతమంది అతని ఇంటికి పరుగుపరుగున వచ్చారు.
 
అలాగే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు హేమంత్ గది తలుపులు బద్దలు కొట్టారు. లోపల హేమంత్ అచేతన స్థితిలో పడివున్నాడు. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు హేమంత్‌ను పరిశీలించి, మృతి చెందాడని నిర్థారించారు. 
 
ఈ వార్త తెలియగానే హేమంత్ భార్య తన కొత్త భర్తతో సహా పరారయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హేమంత్ మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న భార్య, కొత్త భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు.