సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (13:29 IST)

కోడలితో మామ లాడ్జి గదిలో బస ... అర్థరాత్రి సమయంలో...

హైదారాబాద్ నగరంలో ఓ లాడ్జి గదిలో మామతో కలిసిన బసచేసిన కోడలిపై లైంగికదాడి జరిగింది. అర్థరాత్రి వేళ కోడలిపై కన్నేసిన మామే ఈ లైంగికదాడికి తెగబడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీకి చెందిన 52 యేళ్ల మామ, 21 యేళ్ళ కోడలు వస్త్రాల వ్యాపారం నిమిత్తం బుధవారం సాయంత్రం హైదరాబాద్ నగరానికి వచ్చారు. వీరిద్దరూ నాంపల్లిలోని ఓ లాడ్జ్‌లో గదిని అద్దెకు తీసుకుని రాత్రి అందులో బసచేశారు. 
 
అయితే, అర్థరాత్రి తర్వాత తనను మామే బలవంతం చేశాడని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గురువారం ఉదయం హబీబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.