సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (12:19 IST)

హైదరాబాద్ లాడ్జిలో కోడలిపై మామ అర్థరాత్రి అత్యాచారం

హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో ఓ కీచక మామ తన కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కోడలు ఫిర్యాదుతో విషయం వెలుగుచూసింది.
 
వివరాల్లోకి వెళితే.. వ్యాపారం చేస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్న మామ ఢిల్లీలోని చలాస్దామ్ ప్రాంతం నుంచి కోడలితో దుస్తులు కొనేందుకు వచ్చాడు. ఈ క్రమంలో హోటల్ గదిని అద్దెకు తీసుకున్నారు. మామయ్యే కదా అని ఆమె ఢిల్లీ నుంచి అతడితో వచ్చింది.
 
ఇంటివద్ద బుద్ధిగా వుండే మామ నాంపల్లి హోటల్ గదిలో అర్థరాత్రి సమయంలో కామ పిశాచిగా మారాడు. 21 ఏళ్ల కోడలిపై అత్యాచారం చేసాడు. విషయాన్ని ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించాడు. ఐతే తెల్లవారాక కోడలు నేరుగా విషయాన్ని పోలీసులకి ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.