సినీ ఆఫర్ కోసం వచ్చిన అందమైన యువకుడిపై సామూహిక లైంగిక దాడి, ఎక్కడ?
ముంబైలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గుజరాత్ నుండి ముంబై వచ్చిన 19 ఏళ్ల అందమైన యువకుడిపై కొందరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అతడిని బలవంతంగా ఓ పాడుబడిన భవనంలోకి లాక్కెళ్లి దారుణంగా కొట్టడమే కాకుండా వేధించి అతడి వద్ద వున్న డబ్బు దోచుకున్నారు. ఆ తర్వాత అతడిపై లైంగిక దాడి చేసారు.
సోషల్ మీడియాలో ముంబైకి చెందిన ఓ వ్యక్తితో అతడు చేసిన స్నేహం కారణంగా సినీ ఆఫర్ కోసం సిటీ వచ్చాడు. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన యువకుడు తన వెంట రమ్మని తీసుకుని వెళ్లాడు. ఆదివారం నాడు మరికొంతమంది స్నేహితులను పిలిచి అంతా కలిసి మూకుమ్మడిగా అతడిపై దాడి చేసారు.
అతడిపై దాడి, లైంగిక వేధింపులు పాల్పడిన సమయంలో వాటిని తమ సెల్ ఫోన్ల ద్వారా చిత్రీకరించారు. పోలీసులకు చెబితే అవన్నీ లీక్ చేస్తామని బెదిరించారు. ఐనప్పటికీ బాధితుడు విషయాన్నంతా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల కోసం గాలింపు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు.