మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (14:57 IST)

గుజరాత్ ముఖ్యమంత్రి కరోనా పాజిటివ్.. అందుకే సొమ్మసిల్లి పడిపోయారా?

గుజరాత్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని వేదికపైనే కుప్పకూలిపోయారు. అస్వస్థతతో ఉన్నప్పటికీ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అలిసోయి సొమ్మసిల్లి పడిపోయారని బీజేపీ శ్రేణులు తొలుత పేర్కొన్నాయి. కానీ, ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. 
 
వేదికపై స్పృహ కోల్పోయిన ఆయనను హుటాహుటీన హెలికాప్టర్ ద్వారా అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ప్ర్రస్తుతం ఆయనన్ను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
 
సీఎం రూపానీ కరోనా బారినపడినట్టు ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఈసీజీ, సీటీ స్కాన్ ఫలితాలు సాధారణంగానే ఉన్నాయని, ఆందోళన కలిగించే పరిస్థితులు ఏమీ లేవని యూఎన్ మెహతా ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఆర్కే పటేల్ వెల్లడించారు.