అవి మల్లె పువ్వులు కావు.. ఏంటో తెలుసుకోవాలా?
అవి చూసేందుకు మల్లెల్లా వుంటాయ్ కానీ అవి మల్లె పువ్వులు కావు.. ఏంటో తెలుసుకోవాలా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. మల్లె పువ్వులంటే మహిళలకు మహా ఇష్టం. ఇలా ఓ తల్లి తన కుమార్తె వివాహానికి మల్లెపువ్వులను ఇవ్వాలనుకుంది. కానీ కొత్త ఆలోచన అమలులో పెట్టింది.
ఒక తల్లి తన కూతురు సురేఖ పిళ్ళైకి ఏదైన సర్‌ప్రైజ్ చేయాలనుకుంది. వెంటనే ఒక టిష్యూపేపర్ తీసుకొని దానితో ఒక మల్లెపుల బొకే తయారుచేసి చేతిలో పెట్టేసింది. దీన్ని మొదట నిజమైన మల్లెపూల బొకేగా భావించిన సురేఖ.. తర్వాత పరీక్షగా చూసి షాక్‌కు గురయ్యింది. అంతేకాకుండా, కుర్తాసేట్, వెండిరింగులు, బింది మొదలైనవి తయారు చేసి ఇచ్చింది. దీంతో ఆనందంతో ఉబ్బితబ్బిపోయిన సురేఖ తల్లి అధ్బుతమైన కళను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
నెటిజన్లు మొదట సురేఖలాగే మోసపోయి, తీరా అది టిష్యూపేపర్‌తో తయారు చేసినవని తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడిది తెగవైరల్ అయ్యింది. మీ అమ్మాగారి కళకు ఫిదా అవ్వాల్సిందే అని కామెంట్‌లు పెడుతున్నారు. 'ఓహ్, అవి నిజమైన పువ్వులు అని అనుకున్నామని నెటిజన్లు వెరైటీలతో కూడిన కామెంట్లు పెడుతున్నారు.