సంబంధిత వార్తలు
- లాక్ డౌన్ సడలించినా హైదరాబాద్ మెట్రోకు తీరని నష్టం
- ఉషా కిరణాల రాకతో హైదరాబాద్ ఆకాశం వెలిగిపోతోంది.. కంగనా రనౌత్
- చీరకట్టు - నుదుటిన బొట్టు... జయలలిత జిరాక్స్ కాపీ కంగనా రనౌత్
- హైదరాబాద్‌లో టెక్కీ దారుణ హత్య.. సెల్లార్లో మాటువేసి కత్తులతో నరికేశారు...
- IPL 2020 : పరాగ్ సిక్సర్‌తో రాయల్స్ విజయం.. హైదరాబాద్‌కు భంగపాటు!
హైదరాబాద్ నగరంలోని శిథిల భవాలను తక్షణమే ఖాళీ చేయించాలి.. కేటీఆర్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, ఈ వర్షాల ధాటికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైపోతోంది. నగరంలోని నాళాలన్నీ పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైవున్నాయి.
ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాదు పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలంటూ అధికారులను ఆదేశించారు. పాత భవనాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని, ఆ భవనాల్లో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని స్పష్టం చేశారు.
ప్రాణ నష్టాన్ని నివారించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు పాత భవనాల యజమానులకు వివరించాలని కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. ఈ వర్షాకాలంలో హైదరాబాద్ నగరం అత్యధిక వర్షపాతాన్ని చవిచూసింది. ఈ క్రమంలో పాత భవంతులు కూలిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.