గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 అక్టోబరు 2020 (12:33 IST)

చీరకట్టు - నుదుటిన బొట్టు... జయలలిత జిరాక్స్ కాపీ కంగనా రనౌత్

ప్రస్తుతం ఆధునిక జయలలిత దర్శనిస్తోంది. అచ్చం జయలలితలానే ఆమె కనిపిస్తోంది. చీరకట్టులో, నుదుటిన బొట్టుపెట్టుకుని జయలలితను తలపిస్తోంది. ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్. 
 
ఈమె జయలలిత బయోపిక్‌లో నటిస్తోంది. కరోనా లాక్డౌన్ తర్వాత అనేక జాగ్రత్తల మధ్య ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. ఈ షూటింగ్‌లో కంగనా కూడా పాల్గొంటున్నరు. ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఆ సినిమా యూనిట్ షూటింగు పనులు కొనసాగిస్తోంది.
 
ఈ సినిమా షూటింగులో తీసుకున్న కొన్ని ఫొటోలను ఆమె ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తాజాగా, మరిన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. జయలలితలా చీర కట్టుకొని, నుదుటిన బొట్టు పెట్టుకుని సంప్రదాయబద్ధంగా ఆమె కనపడుతోంది.
 
హైదరాబాద్‌లో ఇటీవల షెడ్యూల్‌ పూర్తి చేసుకుని తన స్వస్థలం మనాలికి ఆమె తిరిగివెళ్లారు. కొవిడ్ వ్యాప్తి అనంతరం చాలా విషయాలు మారాయని, యాక్షన్‌, కట్‌ మాత్రం మారలేదని చెబుతూ ఆమె ఈ ఫొటోలు షేర్ చేసింది. జయమ్మ ఆశీర్వాదంతో ఈ సినిమా మరో షెడ్యూల్‌ పూర్తిచేసుకుందని చెప్పింది.