బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: సోమవారం, 12 అక్టోబరు 2020 (15:36 IST)

లాక్ డౌన్ సడలించినా హైదరాబాద్ మెట్రోకు తీరని నష్టం

హైదరాబాద్ నగరంలో మెట్రో సేవలు ప్రారంభమైన నాటి నుండి లాక్‌డౌన్ ముందు వరకు లాభసాటిగానే నడిచింది. ప్రతి నిత్యం వేలాది మందిని వారి వారి గమ్య స్థానాలకు చేర్చుతూ లాభాలను ఆర్జించింది. కాని ఎప్పుడైతే కరోనా లాక్ డౌన్ మొదలయ్యిందో అప్పటి నుంచి మెట్రో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది.
 
లాక్ డౌన్ సడలింపు ఇచ్చిన తర్వాత రైళ్లు ప్రారంభం అయినా కూడా ప్రయాణికుల సంఖ్య మాత్రం తక్కువగా ఉండటంతో మెట్రో తీవ్ర నష్టాల్లో నడుస్తోంది. కరోనా వైరస్ విస్తరించకుండా ఉండటానికి హెచ్ఎంఆర్ఎల్ ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్‌కు భయపడి ప్రజలు మెట్రో రైళ్లలో ప్రయాణించడం లేదు.
 
లాక్ డౌన్‌కు ముందు మొత్తం 4 లక్షల మంది ప్రజలు అన్ని కారిడార్లలో ప్రయాణించేవారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కరోనా వైరస్ పరిస్థితి కారణంగా రెవెన్యూ రోజుకు 70,00 నుండి 80,000కు పడిపోయింది. అన్ని మెట్రో స్టేషన్లోని శానిటైజేషన్ పనులు కూడా నష్టాల్లో ముంచాయి. ఈ పరిస్థితిలో కొంత మంది కోసం మెట్రోను నడపడం తీవ్ర నష్టాన్ని గురిచేస్తున్నది. మొత్తం 160 రోజులు మెట్రోను నిలపడం వల్ల హైదరాబాద్‌లో మెట్రోకు రూ.260 కోట్లు నష్టం వాటిల్లింది.