సంబంధిత వార్తలు
- పేరుకే బిల్లు కలెక్టర్.. అవినీతిలో అనకొండ.. రూ.80 కోట్ల ఆస్తులు
- కిమ్ నిజంగా చాలా మంచోడు- చాలా ఓపెన్ మైండెడ్: డొనాల్డ్ ట్రంప్
- హానర్ వ్యూ10 స్మార్ట్ఫోన్లలో సరికొత్త ఫీచర్
- ఎక్కడ అవినీతి జరిగినా వెంటనే సమాచారమివ్వండి - ఎసిబి డిజి ఠాగూర్ (వీడియో)
- కుమారుడికి 'మరణ శిక్ష'... ఓ తండ్రి తీర్పు : ఎందుకో తెలుసా?
నిజాయితీకి నిలువెత్తు ఆదర్శం... అశ్వరథ ఊరేగింపు...
ప్రభుత్వ ఆఫీసుల్లో లంచం తీసుకుంటున్న అధికారులను పట్టించిన ముగ్గురు వ్యక్తులను అవినీతి నిరోధక శాఖ అధికారులు ఘనంగా సన్మానించారు. అశ్వరథంపై కూర్చోబెట్టి.. మెడలో పూలదండలు వేసి... ఊరంతా ఊరేగించారు.
ప్రభుత్వ ఆఫీసుల్లో లంచం తీసుకుంటున్న అధికారులను పట్టించిన ముగ్గురు వ్యక్తులను అవినీతి నిరోధక శాఖ అధికారులు ఘనంగా సన్మానించారు. అశ్వరథంపై కూర్చోబెట్టి.. మెడలో పూలదండలు వేసి... ఊరంతా ఊరేగించారు. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోయారు. నిజాయితీకి నిలువెత్తు ఆదర్శంగా నిలిచిన ఆ ముగ్గురికి జరిగిన సన్మానం వివరాలను స్పందించారు.
మహబూబాబాద్‌కు చెందిన శ్రీనివాస్ యాదవ్, నర్సంపేటకు చెందిన జడల వెంకటేశ్వర్లు, భూపాల్‌పల్లి జిల్లా జంగేడుకు చెందిన పాలిక రఘుచారి ఈ ముగ్గురు వివిధ పనుల కోసం ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగారు.
ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీరి ద్వారా ఏసీబీ లంచం తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అవినీతి అధికారులను పట్టించిన నిజాయితీపరులుగా వీరిని ఈ విధంగా ఘనంగా సత్కరించింది జ్వాల స్వచ్చంధ సంస్థ.
ఈ ముగ్గురినీ జూలై 20వ తేదీ శుక్రవారం మహబూబాబాద్ పట్టణంలో గుర్రపు బండీ ఎక్కించి ఊరేగించారు. సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ వ్యవస్థాపకుడు సుంకరి ప్రశాంత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ కూడా హాజరై.. ఒక్కొక్కరికీ రూ.15వేలు నగదు బహుమతి అందజేశారు.