పేరుకే బిల్లు కలెక్టర్.. అవినీతిలో అనకొండ.. రూ.80 కోట్ల ఆస్తులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో అవినీతి అధికారిని అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు పట్టుకున్నారు. పేరుకు బిల్లు కలెక్టర్‌గా ఉన్న ఆయన.. అవినీతిలో మాత్రం అనకొండను మించిపోయాడు. విధి నిర్వహణలో అడ్డదారులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో అవినీతి అధికారిని అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు పట్టుకున్నారు. పేరుకు బిల్లు కలెక్టర్‌గా ఉన్న ఆయన.. అవినీతిలో మాత్రం అనకొండను మించిపోయాడు. విధి నిర్వహణలో అడ్డదారులు తొక్కి సంపాదించిన ఆస్తుల విలువ ఏకంగా రూ.80 కోట్ల పైమాటగానే ఉంది.
గుంటూరు నగర పాలక సంస్థలో ఈ అవినీతి అధికారిని పట్టుకున్నారు. ఆయన పేరు ముద్రబోయిన మాధవ్. ఈయన అక్రమంగా సంపాదించిన ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే అవాక్కయ్యారు. ఈయకు గుంటూరులో ఏడు చోట్ల, మాచవరం మండలంలో రెండు చోట్ల, ఇతర ప్రాంతాల్లో నివాసాలు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నివాసాల్లో ఏకకాలంలో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో రూ.50 కోట్ల విలువ చేసే ఆస్తులను గుర్తించగా, ఇవి మార్కెట్ రేట్ ప్రకారం వీటి విలువ రూ.80 కోట్లకు పైగానే ఉంటుందని డీఎస్పీ దేవానంద్ తెలిపారు.
2011లో తన తండ్రి మరణానంతరం కారుణ్య నియామకంలో గుంటూరు నగరపాలక సంస్థలో బిల్ కలెక్టర్‌గా రెవెన్యూ విభాగంలో చేరిన మాధవ్.. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో గుంటూరు, విజయవాడ, ఒంగోలు, రాజమండ్రికి చెందిన ఎనిమిది మంది ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. 20 ప్రాంతాల్లో ఇంటి స్థలాలు గుర్తించామని, నాలుగు గృహాలు సీజ్ చేశామని, ఒక కారు, రూ.7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. 200 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలు భారీగా లభించినట్టు తెలిపారు.