మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 3 మే 2018 (09:41 IST)

కలెక్టర్ అంటే ఇలా ఉండాలి... డ్రైవర్‌ దంపతులకు అదిరిపోయే ట్రీట్..

కలెక్టర్ అంటే ఇలా ఉండాలి అంటూ తన చేతల ద్వారా నిరూపిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లా కలెక్టర్. పేరు టి అన్బళగన్. తన కారు డ్రైవర్‌గా పని చేసి పదవీ విరమణ పొందిన డ్రైవర్‌కు జీవితాంతం గుర్తుం

కలెక్టర్ అంటే ఇలా ఉండాలి అంటూ తన చేతల ద్వారా నిరూపిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లా కలెక్టర్. పేరు టి అన్బళగన్. తన కారు డ్రైవర్‌గా పని చేసి పదవీ విరమణ పొందిన డ్రైవర్‌కు జీవితాంతం గుర్తుండిపోయేలా ట్రీట్ ఇచ్చారు. ఆ డ్రైవర్ దంపతులను తన కారులో కూర్చోబెట్టుకుని స్వయంగా వారి ఇంటి వద్ద దింపి వచ్చారు. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు సైతం సంభ్రమాశ్చర్యాలు వ్యక్తంచేస్తూ, ఆనందభాష్పాలు కార్పారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
కరూర్ జిల్లా కలెక్టర్‌ కారు డ్రైవర్‌గా పరమశివమ్ 35 యేళ్ళపాటు సేవలు అందించారు. ఆయన తాజాగా పదవీ విరమణ చెందారు. దీంతో ఆయన కోసం సరికొత్తగా ఏదైనా చేయాలని భావించిన కలెక్టర్ విధుల చివరి రోజు డ్రైవర్ పరమశివమ్, అతడి భార్యను కారులో ఎక్కించుకుని ఇంటి వద్ద దింపాలని నిర్ణయించుకున్నారు.
 
ఇందుకోసం పరమశివమ్ చివరి రోజు ఫేర్‌వెల్ పార్టీ ముగిశాక డ్రైవర్ దంపతులను స్వయంగా కారు వద్దకు తీసుకెళ్లిన కలెక్టర్ అన్బళగన్ కారు డోర్ తెరిచి వారిని వెనక సీట్లో కూర్చోబెట్టారు. అనంతరం తాను డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ పరమశివమ్ ఇంటికి వెళ్లి దిగబెట్టారు. ఆ తర్వాత వారితో కొద్దిసేపు గడి.. వారిచ్చిన కాఫీ తాగి.. అక్కడ నుంచి తన కార్యాలయానికి వచ్చారు. ఇది చూసిన వారు పరమశివం 35 ఏళ్లపాటు అందించిన సేవలకు కలెక్టర్ సరైన గుర్తింపు ఇచ్చారని ప్రశంసించారు.
 
అయితే, కలెక్టర్ ఇలా తన ఉద్యోగులను ఆశ్చర్యపరచడం ఇదే తొలిసారి కాదు. గత నెల మొదటి వారంలో 80 ఏళ్ల వయసులో అష్టకష్టాలు పడుతున్న ఓ వృద్ధురాలి గురించి తెలుసుకుని ఆమె ఇంటికి వెళ్లారు. గంటపాటు ఉండి ఆమె సమస్యలు విన్నారు. ఆమె వండిన ఆహారాన్ని ఆరగించారు. అనంతరం ఆమెకు రూ.వెయ్యి ఫించన్‌ను మంజూరు చేసే చేసే పత్రాలను చేతికి ఇచ్చి వచ్చారు.