1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Honor View 10 Gets Improved Face Unlock Features and More With New OTA Update

హాన‌ర్ వ్యూ10 స్మార్ట్‌ఫోన్లలో సరికొత్త ఫీచర్

హావాయ్ సంస్థకు చెందిన హాన‌ర్ వ్యూ10 స్మార్ట్‌ఫోన్ల‌కు కొత్త అప్‌డేట్‌ను విడుద‌ల చేస్తామ‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ అప్‌డేట్‌తో ఆయా ఫోన్ల‌లో ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది.

Honor View 10
హావాయ్ సంస్థకు చెందిన హాన‌ర్ వ్యూ10 స్మార్ట్‌ఫోన్ల‌కు కొత్త అప్‌డేట్‌ను విడుద‌ల చేస్తామ‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ అప్‌డేట్‌తో ఆయా ఫోన్ల‌లో ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. జ‌న‌వ‌రి 24లోగా ఈ ఓవ‌ర్ ద ఎయిర్ (ఓటీఏ) అప్‌డేట్ వ‌స్తుంద‌ని కంపెనీ పేర్కొంది. ఈ ఫీచ‌ర్‌ని ఉప‌యోగించాలంటే అప్‌డేట్ వ‌చ్చాక సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫేస్‌ని రిజిస్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. 
 
ఈ ఫోన్ ధర రూ.29,999. ఇది కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. ఆక్టాకోర్ కిరిన్ 970 చిప్‌సెట్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంట‌ర్నెల్ మెమొరీ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్లో ఉన్న ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ టెక్నాల‌జీ యూజ‌ర్ ముఖాన్ని, స్థానాన్ని గుర్తించి ఫోన్‌ను అన్‌లాక్ చేస్తుంది. 

 
About Writer
pnr
తర్వాతి కథనం
'మిమ్మల్ని షో దగ్గర కలుస్తా': గాయని... కారులో ఎక్కించుకుని పంట పొలాల్లో...