శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 14 జనవరి 2018 (10:42 IST)

బీఎస్ఎన్ఎల్ హ్యాఫీ ఆఫర్...

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు హ్యాపీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద పలు ప్యాక్‌లకుగాను వాలిడిటీ(కాలపరితి)ని పొడగించినట్టు బీఎస్‌ఎన్‌ఎల్ ఓ అధికారిక ప్రకనటలో తెలిప

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు హ్యాపీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద పలు ప్యాక్‌లకుగాను వాలిడిటీ(కాలపరితి)ని పొడగించినట్టు బీఎస్‌ఎన్‌ఎల్ ఓ అధికారిక ప్రకనటలో తెలిపింది. 
 
రూ.186 ప్లాన్‌కు వాలిడిటీని 28 రోజులకు పెంచగా రూ.187కు 28 రోజులు, రూ.349కు 54 రోజులు, రూ.429కు 81 రోజుల గడువు నిర్ణయించారు. ఇక ఈ ప్లాన్లలో కస్టమర్లకు రోజుకు 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. 
 
అదేవిధంగా రూ.485 ప్లాన్‌కు 90 రోజుల వాలిడిటీని అందిస్తుండగా, రూ.666 ప్లాన్‌కు 129 రోజుల కాలపరిమితిని బీఎస్‌ఎన్‌ఎల్ ఇస్తున్నది. ఈ రెండు ప్లాన్లలో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి.
 
కాగా, దేశంలో జియో సేవలు ప్రారంభమైన తర్వాత అన్ని ప్రైవేట్ టెలికాం సంస్థలతో పాటు.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కూడా తమ వినియోగదారులను కాపాడుకునేందుకు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తున్న విషయం తెల్సిందే.