మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 10 జనవరి 2018 (16:02 IST)

జియో సంక్రాంతి ఆఫర్.. రోజుకు 5జీబీ డేటా

రిలయన్స్ జియో మరో రెండు కొత్త ఆఫర్లను ప్రకటించింది. సంక్రాంతి ఆఫర్‌ కింద వీటిని తాజాగా వెల్లడించింది. గతవారం పలు ప్రీపెయిడ్ ప్లాన్ల టారిఫ్‌లను రూ.50 వరకు తగ్గించడంతోపాటు కొన్ని ప్లాన్లకు 50 శాతం అదనపు

రిలయన్స్ జియో మరో రెండు కొత్త ఆఫర్లను ప్రకటించింది. సంక్రాంతి ఆఫర్‌ కింద వీటిని తాజాగా వెల్లడించింది. గతవారం పలు ప్రీపెయిడ్ ప్లాన్ల టారిఫ్‌లను రూ.50 వరకు తగ్గించడంతోపాటు కొన్ని ప్లాన్లకు 50 శాతం అదనపు డేటాను అందిస్తూ ఆయా ప్లాన్ల ధరలను మార్చిన విషయం తెలిసిందే. 
 
కాగా జియో దెబ్బకు ఇతర టెలికాం సంస్థలు కూడా పలు ప్లాన్ల టారిఫ్‌లకు అందించే డేటా, వాలిడిటీ బెనిఫిట్స్‌ను పెంచాయి. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా మళ్లీ జియో రంగంలోకి దిగింది. దీంతో తాను అందిస్తున్న రూ.509, రూ.799 ప్లాన్ల బెనిఫిట్స్‌ను మార్చేసింది. 
 
ఈ ప్లాన్లలో భాగంగా, రూ.509 ప్లాన్‌లో ఇప్పటివరకు రోజుకు 2 జీబీ డేటా ఇచ్చేది. దీన్ని ఇకపై 3జీబీ డేటాకు పెంచింది. అయితే, కాలపరిమితిని మాత్రం 49 రోజుల నుంచి 28 రోజులకు తగ్గించింది. 
 
అలాగే రూ.799 ప్లాన్‌లో ఇప్పటివరకు రోజుకు 3జీబీ డేటా లభించగా ఇప్పుడు దాన్ని జియో రోజుకు 5జీబీ వరకు పెంచింది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. అయితే, ఎయిర్‌టెల్‌లో రూ.799 ప్లాన్‌లో రోజుకు 3.5 జీబీ మాత్రమే లభిస్తుండడం గమనార్హం.