శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 2 జనవరి 2018 (14:14 IST)

జియో ఫీచర్ ఫోన్ ఇక.. అమేజాన్‌లో..

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో ప్రస్తుతం ఫీచర్ ఫోన్‌లను అమ్మకానికి వుంచిన సంగతి తెలిసిందే. రూ.1500ల రిఫండబుల్ డిపాజిట్‌‌తో ఈ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఇంద

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో ప్రస్తుతం ఫీచర్ ఫోన్‌లను అమ్మకానికి వుంచిన సంగతి తెలిసిందే. రూ.1500ల రిఫండబుల్ డిపాజిట్‌‌తో ఈ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు జనాలు ఎగబడుతున్నారు.

ఇందుకోసం విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను జియో అమలు చేసింది. కానీ ప్రైవేట్ ఆన్‌లైన్ స్టోర్లకు జియో ఫీచర్ ఫోన్ అమ్మకాలకు పెట్టలేదు. 
 
అయితే భారీ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం అమేజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో జియో ఫీచర్‌ఫోన్‌ను అమ్మకానికి సిద్ధంగా వుంచింది. గ్యాడ్జెట్ గీక్ బిజినెస్ సొల్యూష‌న్ అనే సంస్థ జియో ఫీచర్ ఫోన్ అమ్మకాలను చేపడుతోంది. దీని ధర రూ.1,745తో పాటు రూ.49 డెలివ‌రీ ఛార్జీలు అద‌నంగా జియో ప్రకటించింది.