సంబంధిత వార్తలు
- ట్రయాంగిల్ లవ్ స్టోరీనే నవీన్ హత్యకు కారణమా? .. ఫోన్ కాల్ ఆడియో వైరల్
- నంద్యాల: పెళ్లయిన కూతుర్ని హతమార్చిన తండ్రి
- పెళ్లికి తర్వాత ప్రియుడితోనే కూతురు.. భర్త వద్దకు వెళ్లలేదు.. తండ్రి ఏం చేశాడంటే?
- డెలివరీ కోసం అమెరికాకు ఉపాసన.. ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్న చెర్రీ? (video)
- తండ్రి అయిన టాలీవుడ్ హీరో ఎవరు?
వైద్య విద్యార్థిని ప్రీతి బ్రెయిన్ డెడ్ - ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత!?
వరంగల్ కాకతీయ వైద్య కాలేజీకి చెందిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ఆదివారం వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు వెల్లడించారు. దీనిపై నిమ్స్ వైద్యులు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో ఆస్పత్రి వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు.
అంతకుముందు ప్రీతిని చూసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ప్రీతి బతుకుతుందన్న నమ్మకం ఒక్క శాతమేనని తెలిపారు. ఆమె ఆరోగ్యం అంతకంతకూ విషమంగానే ప్రకటించారు కూడా. ప్రీతి ఘటన అత్యంత బాధాకరమన్నారు. ఆమె మృతి కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
కాగా, తన సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేని ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెల్సిందే. సైఫ్‌తో పాటు మరికొందరు సైనియర్ విద్యార్థులు చేసిన ర్యాగింగ్ కారణంగా వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె గత ఐదు రోజులుగా నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాగా, ఆమె ఆదివారం సాయంత్రం బ్రెయిన్ డెడ్ అయినట్టు ప్రకటించారు.
