గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (14:23 IST)

ట్రయాంగిల్ లవ్ స్టోరీనే నవీన్ హత్యకు కారణమా? .. ఫోన్ కాల్ ఆడియో వైరల్

hariharakrishna - father
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నవీన్ అనే యువకుడికి దారుణ హత్యకు ముక్కోణపు ప్రేమ కథే కారణంగా తెలుస్తుంది. నవీన్ హత్య తర్వాత హరిహరకృష్ణ తన స్నేహితులకు ఫోన్ చేసి మాట్లాడిన ఆడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
మరోవైపు ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన హరిహరకృష్ణ తండ్రి మరోలా స్పందిస్తున్నారు. మద్యం మత్తులోనే ఇలా జరిగివుంటుందని, అయితే, ఈ హత్యను తన కుమారుడు ఒక్కడే చేసివుంటానని తాము భావించడం లేదని దీని వెనుక ఎవరో ఉండివుంటారని చెప్పారు. 
 
అందువల్ల ఈ కేసులో పోలీసులు లోతుగా విచారణ జరిపి నిజానిజాలను బహిర్గతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశాడు. నవీన్, హరిహరకృష్ణ స్నేహితురాలిని కూడా విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని ఆయన అంటున్నారు. పైగా, హత్యకు గురైన నవీన్ తల్లిదండ్రులకు ఆయన బహిరంగ క్షమాణాలు చెప్పారు. ఇలా జరగడాన్ని తాను కూడా సమ్మతించబోనని చెప్పారు. 
 
అయితే, తమ కొడుకుని  ఆ అమ్మాయి ప్రేమతో మోసం చేసిందని, నవీన్‌ను చంపడానికి ఆ అమ్మాయి కారణమని అన్నాడు. తన కొడుకు ఒక్కడే ఇందులో చిక్కాడని చెప్పాడు. అయితే, ఈ హత్య కేసులో ఆ అమ్మాయితో పాటు మరికొందరి హస్తం ఉండివుండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా, ఆ యువతి వాట్సాప్, కాల్ డేటాను విశ్లేషించాలని ఆయన పోలీసులను కోరారు.