గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2023 (21:01 IST)

డెలివరీ కోసం అమెరికాకు ఉపాసన.. ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్న చెర్రీ? (video)

Ramcharan, Upasana Konidela
టాలీవుడ్ స్టార్ హీరో, ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చరణ్ బుధవారం గుడ్ మార్నింగ్ అమెరికా అనే టాక్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షోకి అమెరికాలోని ప్రముఖ గైనకాలజిస్ట్ జెన్నీఫర్ ఆస్టన్ కో హోస్ట్గా వ్యవహరించారు. తన భార్య ఉపాసన ప్రెగ్నెంట్‌గా వున్న వేళ జెన్నీఫర్‌ను కలవడం హ్యాపీగా వుందని చెప్పిన చరణ్ ఫోన్ నెంబర్‌ తీసుకుంటానని చెప్పారు. 
 
అలాగే తన భార్య డెలీవరీకీ అమెరికా వస్తుందని.. తమకు అందుబాటులో వుంటే బాగుంటుందని కూడా జెన్నీని కోరారు. అందుకు జెన్నీఫర్ ఓకే అంటూ చెప్పింది. 
 
చెర్రీ ఫ్యామిలీతో ట్రావెల్ చేసేందుకు రెడీనని ప్రకటించింది. అలాగే చెర్రీ-ఉపాసన ఫస్ట్ బేబీని డెలివరీ చేయడం తనకు గౌరవప్రదమని తెలిపింది. ఈ టాక్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.