తండ్రి అయిన టాలీవుడ్ హీరో ఎవరు?
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన మరో హీరో నవీన్ చంద్ర తండ్రి అయ్యాడు. ఈయన భార్య తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆయన ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ విషయాన్ని నవీన్ చంద్ర తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "తాను, ఓర్మా మగబిడ్డతో ఆశీర్వదించబడ్డాము" అని నవీన్ ట్వీట్ చేశాడు.
ఈసందర్భంగా తన కొడుకును ఎత్తుకున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. తండ్రి అయిన శుభ సందర్భంలో నవీన్ చంద్రకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కెరీర్ విషయానికి వస్తే... ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లతో నవీన్ చంద్ర చాలా బిజీగా ఉన్న విషయంతెల్సిందే.