ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 25 ఫిబ్రవరి 2023 (11:44 IST)

నంద్యాల: పెళ్లయిన కూతుర్ని హతమార్చిన తండ్రి

murder
నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరులో పరువు హత్య కలకలం రేపింది. పెళ్లయిన కూతుర్ని కన్న తండ్రే కడతేర్చారు. ప్రసన్న(21)కు రెండు సంవత్సరాల క్రితం బనగానపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో వివాహం అయింది. అయితే, కొన్ని రోజుల కిందట ప్రసన్న ఆలమూరులో తండ్రి దేవేందర్ రెడ్డి వద్దకు వచ్చారు. తరువాత, అదే గ్రామానికి చెందిన ప్రియుడితో పరారయ్యారు. అనంతరం, పెద్దలు పెద్దమనుషులతో పంచాయతీ నిర్వహించి ఎవరి ఇంటికి వారిని పంపేశారు.
 
ఇకనైనా భర్త దగ్గరికి వెళ్లాలని తండ్రి కోరగా, ప్రసన్న నిరాకరించారు. దాంతో, తండ్రి ఇంట్లోనే ఆమె గొంతు పిసికి చంపారు. మరికొంతమంది సహాయంతో మృతదేహాన్ని కారులో గిద్దలూరు ఘాట్‌కు తీసుకొని వెళ్లి తల, మొండెం వేరు చేసి లోయలో పడవేసినట్లు పోలీసులు గుర్తించారు. పాణ్యం పోలీసులు కేసు నమోదు చేసి తండ్రి దేవేందర్ రెడ్డితో పాటు మరికొందని అరెస్ట్ చేశారు.