సంబంధిత వార్తలు
- నా కొడుకు ముఖం చూపించి చంపేసి వుంటే సంతోషపడేవాడిని: 'దిశ' నిందితుడు తండ్రి
- దిశ నిందితుల పోస్టుమార్టం, అలిగి వెళ్లిపోయిన డాక్టర్లు, ఎందుకు?
- ఎన్కౌంటర్ పై హైకోర్టులో 9న విచారణ... మృతదేహాల అంత్యక్రియలకు బ్రేక్
- మానవ మృగాలకు ఇదో గుణపాఠం: చిరంజీవి
- హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి... ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల వెల్లువ
దిశ తల్లిదండ్రులకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ పిలుపు
చటాన్‌పల్లి వద్ద హత్యాచారానికి గురైన ‘దిశ’ తల్లిదండ్రులకు జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నుంచి పిలుపొచ్చింది. వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ వారిని కోరింది.. కేసు విచారణలో భాగంగా దిశ తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని నమోదు చేది..
ఈ నేపథ్యంలో తల్లిదండ్రులను రాష్ట్ర పోలీస్ అకాడమీకి తీసుకెళ్లేందుకు పోలీసులు శంషాబాద్‌లోని ఇంటికి వెళ్లారు. దిశ దశదిన కర్మ రోజున విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమె తల్లి ఆరోగ్యం సహకరించడం లేదని ఇబ్బంది పెట్టొద్దని పోలీసులను కోరారు. మరోవైపు ఎన్‌హెచ్‌ఆర్‌సీ తీరుకు నిరసనగా దిశ నివాసం వద్ద కాలనీవాసులు ఆందోళకు దిగారు.
ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి మరోసారి ఎన్‌హెచ్‌ఆర్సీ
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవహక్కుల కమిషన్ విచారణ కొనసాగుతోంది. చటాన్‌పల్లి వద్ద ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని ఎన్హెచ్ఆర్సీ బృందం మరోసారి పరిశీలించనుంది. ఎన్‌కౌంటర్ జరిగిన తీరును పోలీసులు వివరించనున్నారు. తొలిరోజు మహబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రిలో నిందితుల మృతదేహాలు, చటాన్ పల్లి వద్ద ఘటనా స్థలాలను కమిషన్ సభ్యులు పరిశీలించారు.
