మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 7 డిశెంబరు 2019 (16:12 IST)

దిశ నిందితుల పోస్టుమార్టం, అలిగి వెళ్లిపోయిన డాక్టర్లు, ఎందుకు?

దిశ నిందితులు ఎన్ కౌంటర్లో మరణించిన సంగతి తెలిసిందే. వీరికి నిన్న పోస్టుమార్టం నిర్వహించారు. నిందితుల మృత దేహాలను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ గాంధీ ఆసుపత్రి నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుల బృందంతో ఈ ప్రక్రియ పూర్తి చేశారు.

ఇందులో ఆసుపత్రికి చెందిన ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడి కృపాల్ సింగ్, అసోసియేట్ ప్రొఫెసర్ లావణ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ మహేందర్ తో పాటు మరో ఇద్దరు పీజీ విద్యార్థుల బృందం పాల్గొని క్షుణ్ణంగా మృతదేహాలను పరిశీలిస్తూ పోస్టుమార్టం పూర్తి చేశారు. ఈ వ్యవహారమంతా నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై రాత్ర 9 గంటల వరకూ సాగింది. 
 
ఇదిలావుంటే వీరి మృత దేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు కూడా వచ్చారు. ఐతే ఈలోపుగానే గాంధీ ఆసుపత్రి వైద్యులు పని పూర్తి చేయడంతో మహబూబ్ నగర్ వైద్యులు పోలీసులపై అలిగారట. ఇకపై వచ్చే మృతదేహాలన్నిటికీ గాంధీ ఆసుపత్రి వైద్యులనే పిలిపించుకుని చేయించుకోండంటూ వెళ్లిపోయారట.