1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. No intention of joining politics..but: senier IPS

రాజకీయాల్లో చేరే ఉద్దేశం లేదు..కానీ: మనసులో మాట చెప్పిన సీనియర్ ఐపీఎస్

politics
తన పదవికి రాజీనామా చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ తన మనసులో మాట చెప్పారు.

ఉద్యోగానికి రాజీనామా చేసిన సింగ్ తన రాజీనామాను ఆమోదించాలంటూ కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ పరంగా అత్యంత శక్తమంతులైన ప్రజలు బలవంతుల చేతుల్లో కీలు బొమ్మలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, ఇందుకు రాజకీయ నాయకులను బాధ్యులను చేయలేమని, తప్పంతా ప్రజల్లోనే ఉందని అన్నారు. ఏ రాజకీయ నాయకుడూ రాష్ట్రాన్ని బంగారంగా మార్చలేరని, ప్రజలు మాత్రమే ఆ పని చేయగలరన్నారు. 
 
రాజకీయాల్లో చేరే ఉద్దేశం తనకు ఎంతమాత్రమూ లేదని, వివేకానంద, సుభాష్ చంద్రబోస్, మహాత్మాగాంధీ బాటలో నడుస్తూ ప్రజలతో కలిసి పనిచేస్తానని అన్నారు.

అన్నాహజారే చేస్తున్న పనిని తాను కొనసాగిస్తానని పేర్కొన్నారు. తన రాజీనామాకు అనుమతి వచ్చిన తర్వాత తన ప్రణాళికను వివరిస్తానని పేర్కొన్నారు.
తర్వాతి కథనం
దేశంలో మరోసారి లాక్ డౌన్?