మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2020 (09:00 IST)

చంద్రబాబువి నీచ రాజకీయాలు: మంత్రి పెద్దిరెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు.

ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌పై ప్రజలు భయాందోళనలు చెందుతుంటే.. వైఎస్సార్‌సీపీ నేతలను చంద్రబాబు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు చేసింది శూన్యమని విమర్శించారు. దళితులు అంటే చంద్రబాబుకు చిన్నచూపు అని  నిప్పులు చెరిగారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మంత్రి పెద్దిరెడ్డి తప్పుపట్టారు.