రానున్న 24గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
రానున్న 24 గంటల్లో మాత్రం ఉత్తర తెలంగాణ, రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇందులో భాగంగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో రానున్న 4రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ్టి నుంచి సోమవారం వరకు ఉత్తరాంధ్ర, దక్షిణకోస్తాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది.
శుక్రవారం నుంచి సోమవారం వరకు రాయలసీమలో భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. గురువారం గుంటూరు, ప్రకాశం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరుగా, ఇతర ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయి.
గత నాలుగు రోజులుగా తెలుగు రాష్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.