బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 24 జూన్ 2020 (09:32 IST)

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు విజ్ఞప్తి.. ఇప్పట్లో అంతరాష్ట్ర సర్వీసులు లేనట్లే!

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పట్లో అంతరాష్ట్ర బస్సు సర్వీసుల రాకపోకలు సాగేలా కనిపించడం లేదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలు లేకపోవడమే మేలని అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర సర్వీసులు నడిపే విషయమై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ఒక దఫా చర్చించారు. మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని భావించారు.

అయితే ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశం బుధవారం జరగాల్సి ఉంది.

అనివార్య కారణాల వల్ల సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో బస్సు సర్వీసులను ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పుడు ప్రారంభించడం శ్రేయస్కరం కాదనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.