తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ కొనాలంటే చెమటలు పడుతున్నాయి. ఏపీలో కేజీ చికెన్ ఏకంగా రూ.300 దాటింది. బ్రాయిలర్ కోళ్ల చరిత్రలో ఇదే రికార్డు ధర.
ఇది దేశంలో కెల్లా అత్యధిక ధర కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ కొనాలంటే చెమటలు పడుతున్నాయి. ఏపీలో కేజీ చికెన్ ఏకంగా రూ.300 దాటింది. బ్రాయిలర్ కోళ్ల చరిత్రలో ఇదే రికార్డు ధర. ఇది దేశంలో కెల్లా అత్యధిక ధర కావడం గమనార్హం.
పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకాన్ని 60 శాతానికి తగ్గించడంతో కోళ్ల లభ్యత లేకుండా పోయింది. ఇక హైదరాబాద్ లో కేజీ చికెన్ రూ. వరకు పలుకుతోంది. రంజాన్ నెలలో చికెన్ వినియోగం పెరగడం కూడా రేటు పెరిగేందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
మరోవైపు.. కోవిద్-19 భయంతో మొన్నటివరకు కిలో బ్రాయిలర్ చికెన్ రూ.25-50 లోపే ధర పలికింది. చివరకు బతికున్న కోడిని రూ.25కు ఇచ్చినా తీసుకునేవారు లేరు. పెంపకం, మేత ఖర్చులు కూడా రాక రైతులు నష్టాలను చవిచూశారు. దీనివల్ల కొన్నిచోట్ల కోళ్లను మేపలేక మిన్నకుండిపోయారు. మరికొన్ని చోట్ల గొయ్యి తీసి పాతేశారు.
ఈ పరిణామాలతో 60శాతం కోళ్ల ఫారాల్లో కోళ్లే లేకుండా పోయాయి. ఇంటిగ్రేషన్ కంపెనీలు కూడా కొత్త కోడిపిల్లల బ్యాచ్‌లను పెంచడం ఆపేశాయి.