మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 11 ఏప్రియల్ 2020 (09:38 IST)

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం!

అరేబియా మధ్య ప్రాంతం నుంచి కర్నాటక మీదుగా విదర్భ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా, తెలుగు రాష్ట్రాల్లో రాగల 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉపరితలానికి 900 మీటర్ల ఎత్తులో  ఈ ద్రోణి కొనసాగుతోందని వెల్లడించారు.
 
దీని ప్రభావం తెలంగాణపై అధికంగా ఉంటుందని అంచనా వేశారు. ఇదే సమయంలో ఉత్తర కోస్తాంధ్ర, ప్రకాశం, గుంటూరు జిల్లాలపై ప్రభావం చూపుతుందని, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి ఒకరు అంచనా వేశారు.