గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 2 జనవరి 2020 (07:37 IST)

తెలుగు రాష్ట్రాలు గజగజ

తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చలి గాలులకు వర్షం తోడైంది. ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. 

గత రెండు రోజులుగా  హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వర్షం పడింది. ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వాన కురిసింది. దీంతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. చలి తీవ్రత పెరిగింది. ఉదయం, రాత్రే కాదు.. మధ్యాహ్నం కూడా చలి తీవ్ర ఉంటోంది. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే జనాలు గజగజ వణుకుతున్నారు.

బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు ఏపీ, తెలంగాణలో వానలు పడతాయని హైదరాబాద్ వాతావారణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని, చలి తీవ్రత పెరుగుతుందని చెప్పారు.

ఇప్పటికే  ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. ఎముకలు కొరికే చలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, కూలి పనులు చేసుకునే వారు అవస్థలు పడుతున్నారు.  ది చాలదన్నట్టు వానలు పడుతున్నాయి. అటు చలి, ఇటు వర్షం.. జనాలు  నలిగిపోతున్నారు.