శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (08:54 IST)

ఏపీలో విపరీతంగా తగ్గిన చికెన్ ధర

ఏపీలో చికెన్‌ ధరలు గణనీయంగా తగ్గాయి. గత నెల వరకూ కిలో కోడిమాంసం రూ.200 వరకూ ఉండగా... ప్రస్తుతం రూ.120కి తగ్గిపోయింది. కరోనా వైరస్‌ భయమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

కోళ్లలో వైరస్‌ ఉంటుందన్న ప్రచారంతో దేశవ్యాప్తంగా చికెన్‌ వినియోగం బాగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థి తి స్పష్టంగా కనిపిస్తోంది. ఫారం కోడి కిలో రూ.100 నుంచి రూ.60కి తగ్గగా, చికెన్‌ ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.

చికెన్‌ రిటైల్‌గా కిలో రూ.120 అంటూ బోర్డులు పెట్టినా, కొనుగోళ్లు లేక చికెన్‌షాపులు వెలవెలబోతున్నాయి. రెస్టారెంట్లలోనూ నాన్‌వెజ్‌ ఫుడ్‌కు ఆర్డర్లు తగ్గాయి.

అలాగే కోడిగుడ్ల ధరలు కూడా కొద్దికొద్దిగా తగ్గుతున్నాయి. గతవారం వంద గుడ్లు రూ.420 ఉండగా, తెలంగాణలో రూ.380కి తగ్గింది. ఏపీలోనూ ధర రూ.20 తగ్గింది.