రాగల 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు
రాయలసీమ, కోస్తాంధ్రలో రాగల 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.
రాయలసీమ కోస్తాంధ్ర మొత్తం నైరుతి రుతుపవనాలు విస్తరించాయని, దాంతో గడిచిన 24 గంటలో అన్ని ప్రాంతాలు సాధారణ వర్షపాతం నమోదైందని తెలిపారు.
రాబోయే 24 గంటలో రాయలసీమ కోస్తా ఆంధ్రలో ఉరుములు మెరుపులులతో వర్షం పడే అవకాశం వుంది. రేపు ఉత్తర కోస్తా ఆంధ్రలో రేపు బారి వర్షాలు పడే అవకాశం. గత ఏడాది కంటే ఈ ఏడాది రుతుపవనాలు త్వరగానే వచ్చేశాయి.
ప్రస్థుతం అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. మరో రెండు రోజుల పాటు సాధారణ వర్షపాతం కొనసాగుతుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.
రాగల 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం. కోస్తాఆంధ్ర తీరం నుండి బలమైన 40 నుండి 50 ఈదురు గాలులు వీస్తాయి. ఈ మేరకు మత్యకారులు వేటకు వెళ్లోద్దని సూచించారు.