అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: మంత్రి కన్నబాబు
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.
ఆయన అకాల వర్షాలు-పంట నష్టంపై అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా నష్టపోయిన పంట వివరాలను అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. పంట నష్టంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వాకబు చేశారని మంత్రి కన్నబాబు తెలిపారు.
పంట నష్టం వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం తరఫున రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.
ఇది రైతు ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల వివిధ జిల్లాల్లో జరిగిన పంట నష్టం వివరాలను ఈ సందర్భంగా మంత్రి కురసాల కన్నబాబు వివరించారు.