శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (16:16 IST)

ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల వరకు మోస్తరు వర్షాలు

ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి దక్షిణ కోస్తా తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ  మరియు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 km ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.
  
కోస్తా ఆంధ్ర మరియు యానాం:
ఈ రోజు విశాఖపట్టణం, తూర్పుగోదావరి  జిల్లాలలో ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడ అక్కడ  కురిసే అవకాశం ఉంది.

రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో   ఉరుములు,  మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 km)  పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో అక్కడ అక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, అక్కడ అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడ అక్కడ  కురిసే అవకాశం ఉంది. 
ఈ రోజు , ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రేపు  దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ  కురిసే అవకాశం ఉంది.
       
రాయలసీమ:
ఈ రోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు  రాయలసీమలో  గరిష్ట ఉష్ణోగ్రతలు అక్కడక్కడ 41 నుండి 43 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది.