ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (12:56 IST)

రేపటి నుంచి నిత్యావసర రవాణాకు మరో 57 పార్శిల్​ రైళ్లు

నిత్యావసర సరకుల రవాణాకు ఏప్రిల్​ 15 నుంచి 25 వరకు మరో 57 పార్శిల్​ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

రైళ్లలో కొవిడ్​-19 చికిత్స కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్​ సేవలు, వైద్య సౌకర్యాలను జీఎం గజానన్​ పరిశీలించారు. నిత్యావసర సరుకుల రవాణాకు ఇప్పటికే 37 పార్శిల్‌ రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే.. మరో 57 పార్శిల్‌ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది.

కాకినాడ టౌన్‌- సికింద్రాబాద్‌- కాకినాడ మధ్య ఏప్రిల్‌ 15 నుంచి 25 వరకు 22 సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. రేణిగుంట-సికింద్రాబాద్‌ వయా గుంతకల్‌, రాయచూర్‌ మీదుగా ఈ నెల 16, 18, 20, 22, 24వ తేదీల్లో 10 ప్రత్యేక పార్శిల్‌ రైళ్లను నడుపుతున్నామని రైల్వేశాఖ పేర్కొంది.

లాలాగూడలోని సెంట్రల్ ఆసుపత్రిని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోవిడ్-19 చికిత్స కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ సేవలు, వైద్య సౌకర్యాలను పరిశీలించారు.