బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (12:23 IST)

వైఎస్‌ఆర్‌ టెలి మెడిసిన్ ప్రారంభం

కరోనా నివారణా చర్యలో భాగంగా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ టెలిమెడిసిన్‌ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ముందుగా, టెలిమెడిసన్‌ టోల్‌ ఫ్రీ నెంబరు 14410కు ఫోన్‌ చేసి, డాక్టర్‌తో ముఖ్యమంత్రి మాట్లాడారు.

తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఈ విధానాన్ని పటిష్టంగా, బలోపేతగా నడపాలని అధికారులను ఆదేశించారు. క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, అవసరమైతే వైద్యుల సంఖ్యను పెంచాలని సూచించారు. కరోనా నివారణా చర్యలపై సమీక్ష నిర్వహించారు.

ఎయిమ్స్‌ వైద్యులతో మాట్లాడి వైరస్‌ సోకిన వారికి అత్యుత్తమ వైద్య విధానాలను అందించాలని ఆదేశించారు. కుటుంబ సర్వేద్వారా వ్యాధి లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించిన వారికి ముందుగా పరీక్షలు చేయాలని సూచించారు.

అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరోనా రోగుల కోసం కనీసం 400 బెడ్లను అందుబాటులోకి తీసుకురావాలని సిఎం ఆదేశించారు. ఎన్‌-95 మాస్క్‌లు కూడా రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేలా ప్రయత్నాలు చేయాలని సూచించారు.

ప్రస్తుతం రోజుకు 10వేల చొప్పున పీపీఈలను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు సిఎంకు వివరించారు. రోజుకు 1100 నుంచి 1200 వరకూ పరీక్షలు చేయిస్తున్నట్లు తెలిపారు. ఆక్సిజన్‌ సరఫరాకు లోటు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.