గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (10:01 IST)

ఎట్టకేలకు రాష్ట్రానికి చేరుకున్న తెలుగు విద్యార్థులు

ఇటలీ నుంచి నుంచి ఢిల్లీకి వచ్చిన తెలుగు విద్యార్థులు ఎట్టకేలకు విజయవాడకు చేరుకున్నారు. వీరంతా ఆర్మీ క్యాంపులో 28 రోజుల క్వారంటైన్‌ తర్వాత రాష్ట్రానికి వచ్చారు. గత నెల 14వ తేదీన ఇటలీ నుంచి 29 మంది విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత వీరందరినీ కేంద్ర సర్కారు ఏర్పాటు చేసిన ఆర్మీ క్యాంపుకు తరలించారు. 
 
అయితే, వీరికి క్వారంటైన్ ముగిసినప్పటికీ.. లాక్‌డౌన్ కారణంగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వీరిని అనుమతించలేదు. దీంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డితోపాటు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావులు జోక్యం చేసుకుని కేంద్రం దృష్టికి తీసుకుని, విద్యార్థులంతా విజయవాడకు వచ్చేలా తగిన చర్యలు తీసుకున్నారు. ఫలితంగా 29 మంది తెలుగు విద్యార్థులు ఎట్టకేలకు విజయవాడకు చేరుకున్నారు. 
 
మరోవైపు, కరోనా లాక్‌డౌన్ సమయంలో విశాఖపట్టణంలో చిక్కుకుపోయిన ఆరుగురు జపాన్ దేశీయులను జపాన్ ఎయిర్‌లైన్స్ ప్రత్యేక విమానంలో బెంగళూరు మీదుగా వారి దేశానికి తీసుకువెళ్లారని విశాఖపట్టణం విమానాశ్రయ డైరెక్టరు రాజ్ కిషోర్ చెప్పారు. కేంద్రప్రభుత్వం అనుమతితో ఆరుగురు జపాన్ దేశీయులను తరలించామని విమానాశ్రయ అధికారులు చెప్పారు.