శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 12 మే 2020 (21:04 IST)

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిర‌వుతున్న హైద‌రాబాద్ నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భాగ్యనగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది.

దీంతో మంగ‌ళ‌వారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఎస్సాఆర్‌‌నగర్‌, అమీర్‌పేట, పంజాగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి.

అయితే భారీ వర్షం కురిసిన చోట లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు.