శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2020 (13:43 IST)

హైదరాబాద్‌ లో అన్నార్తులు 040- 21111111కి నెంబర్‌కి కాల్‌ చేయండి

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఎవరికైనా భోజనం అవసరమైతే జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌ నంబర్‌ 040- 21111111కి ఫోన్‌ చేయాలని టీఆరెస్ నాయకురాలు కవిత పేర్కొన్నారు.

ఈ నెంబర్‌ అందరికీ తెలిసేలా చేయాలని హ్యాష్‌ ట్యాగ్‌తో ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదనే తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.

మరోవైపు, జీహెచ్‌ఎంసీతోపాటు తొమ్మిది కార్పొరేషన్లలో 300 అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు 2 లక్షల మందికి రెండు పూటలా భోజనం అందిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ చెప్పారు.

ఈ కేంద్రాల్లో ఉదయం 10.30 గంటలకు, సాయంత్రం 5 గంటలకు భోజనం అందించేలా వేళలు కూడా మార్చామని వివరించారు.