శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (18:58 IST)

హైదరాబాద్‌లో ‘కరోనా కారు’

మొన్న ‘కరోనా హెల్మెట్లు, స్వీట్లు’, నిన్న ‘కరోనా జ్యువెలరీ’.. నేడ ‘కరోనా కారు’. అదేంటి కరోనా కార్ అని ఆశ్చర్యపోతున్నారా? అవును, హైదరాబాద్ వీధుల్లో తిరుగుతుంది.

ఒక రేంజ్‌లో విజృంభిస్తోన్న కరోనాని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా పలు కఠిన చర్యలు అమలు పరుస్తుంది. అయినా కూడా వాటిని లెక్క చేయకుండా పలువురు రోడ్లపైకి వస్తూనే ఉన్నారు.

ఇలాంటి వారిని కట్టడి చేయడానికి. కరోనా హెల్మెట్లు వేసుకుని ప్లకార్డులు పట్టుకుని పోలీసులు రోడ్లపై ర్యాలీలు కూడా చేశారు. అలాగే చిన్నపాటి శిక్షలు కూడా చేశారు.

ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఏ పనీ లేకుండా రోడ్లపై తిరిగే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి వినూత్నం కరోనాపై అవగాహన కల్పించేలా.. తన అభిరుచి మేరకు కరోనా వైరస్ ఆకృతిలో ఓ కారును తయారు చేసి రోడ్లపై తిప్పుతున్నారు.

కరోనా వైరస్ ఆకారంలో ఓ పెద్ద గుండ్రని వస్తువు రోడ్లపై తిరుగుతుండటం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్‌లోని సుధా కార్జ్ మ్యూజియం వ్యవస్థాపకుడైన సుధాకర్ అనే వ్యక్తి ఈ కారును తయారు చేసి రోడ్లపై తిప్పారు.

కేవలం పది రోజుల్లోనే ఈ కరోనా కారును తయారు చేసినట్లు సుధాకర్ వెల్లడించాడు. ఇందులో ఒకరు కూర్చొని ప్రయాణించవచ్చని తెలిపారు.

100 సీసీ ఇంజిన్ సామర్థ్యం దీని సొంతమని, లీటరుకు 40 కిలో మీటర్లు ప్రయాణించగలదని, అంతేకాక, దీని ద్వారా యువతలో అవగాహన కల్పించవచ్చని సుధాకర్ చెప్పారు.

అలాగే.. ఆయనకి కార్ల మీద ఉన్న మక్కువతో.. పలు రకరకాల కార్లను తయారు చేసినట్లు పేర్కొన్నాడు.